చర్లపల్లి : 7వ తేదీ మధ్యాహ్నం సూరారం లోని మల్లారెడ్డి హాస్పిటల్ ముందు మినిస్టర్ మల్లారెడ్డి బఫర్ జోన్ నియమాలను పాటించకుండా చెరువు భూములను ఆక్రమించి హాస్పిటల్ నిర్మించారని అందుకు గాను మల్లారెడ్డి హాస్పిటల్ ను వెంటనే ఉచిత కరోనా హాస్పిటల్ గా మార్చాలని NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్ముర్ సారథ్యంలో NSUI నాయకులు నిరసన తెలపడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అదే రోజు రాత్రి దుండిగల్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన విషయం విధితమే..

చర్లపల్లి జైలు నుండి 6 రోజుల రిమాండ్ అనంతరం కొద్దిసేపటి క్రితం NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ మరియు అతని NSUI బృందం బెయిల్ పై విడుదలవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ…. కరోనా నియమాలను పాటిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన తమ పై అక్రమంగా కేసులు బనాయించి జైలుకు తరలించడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని, తాను ఒక ఎంబీబీఎస్ విద్యార్థిననీ, అంతే కాకుండా తనతో ఉన్న వారందరూ విద్యార్థులని కూడా చూడకుండా మల్లారెడ్డి హాస్పిటల్ డాక్టర్లపై దాడి చేశామని అక్రమంగా కేసులు పెట్టి నిర్దాక్షిణ్యంగా జైలుకు తరలించారని, కేసులో ఉన్న లోపాలను అదే విధంగా దీని వెనక ఉన్న నాయకుల అక్రమ చిట్టాను సాక్ష్యాలతో సహా భవిష్యత్తులో గాంధీ భవన్ వేదికగా మీడియా ముఖంగా బట్టబయలు చేస్తానని తెలిపారు.
విడుదలైన NSUI నాయకుల వివరాలు
1) వెంకట్ బల్మూర్, 2)రితీష్ రావు రెగులపటి, 3) గొల్ల జాన్, 4) జీవన్ మన్నే, 5) అరుణ రెడ్డి, 6) రాజశేఖర్ రెడ్డి, 7) పవన్, 8) బిలల్, 9) వినయ్ పటేల్, 10) పృథిరాజ్, 11) దీక్షిత్, 12) గౌతం రావు, 13) రాకేష్ ముదిరాజ్.