తొలిపలుకు న్యూస్ : చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య కేసులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న ఉదయం 8.05 నిమిషాలకు కొనార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ట్రైన్‌ను డ్రైవ్ చేస్తున్న డ్రైవర్స్ ప్రత్యక్షంగా చూసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాజు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అక్కడ ఉన్న కొంత మంది రైతులు కళ్లారా చూశారన్నారు. ఉదయం విధులకు వెళుతున్న వారు కూడా రాజును గుర్తు పట్టి ప్రశ్నిస్తుండగా అక్కడ నుండి పారిపోయాడని తెలిపారు. రాజు ఆత్మహత్య కేసులో 7 మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని… వారి చెప్పిన విషయాలు అన్ని కూడా వీడియో గ్రఫీ చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు..
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more