అవును నిజం. ప్రపంచమంతా కరోణా కోరల్లో కకావికలమవుతుంటే ఆ ఆరు దేశాల్లో ఒక్క కరోణా కేసు కూడా నమోదు కాలేదు. ఈ మధ్యనే “W.H.O” ఈ జాబితా విడుదల చేసింది. అవి: తుర్కమెనిస్తాన్, కుక్ ఐలాండ్స్, నార్త్ కొరియా, టేకెలావ్, నౌరు, తువాలు.
అయితే ఇందులో నార్త్ కొరియా మొదటి నుంచి ఇతర దేశాల నుంచి రాకపోకలను నిషేధించింది. చాలా రోజుల వరకు ఇతర దేశాల నుంచి వాక్సిన్ లతో సహా ఏ వస్తువునూ దిగిమతి చేసుకోలేదు. ఇక ఇందులో మిగితా దేశాలు చాలా చిన్నవి. సముద్రం సరిహద్దులు గా గల ద్వీపాలు. ఇవి విదేశీయులను అనుమతించక పోవడం, అనుమతించినా వాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం, తమ దేశం లో ప్రజలకు ఎక్కువ శాతం వాక్సీన్ డోసులు త్వరగా పూర్తి చేయడం వంటివి పకడ్బందీగా అమలు చేయడం వలన కరోణా ని నియంత్రించగలిగాయి.