నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి అతి సమీపంలో ఉన్న GHMC హైదర్ నగర్ హై టెన్షన్ లైన్ రోడ్ ప్రాంతం నుండి, డ్రైనేజ్ లైన్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజ్ లైన్ కి అనుసంధానం చేయడం వలన డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతిని,వర్షపు నీరు,మురుగు నీరు పొంగి పొర్లుతూ రోడ్ పై పారుతున్నందున రోడ్ పై ప్రయాణించే వాహనదారులు, అదే విధంగా రోడ్ పక్కన చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ అరికేపూడి గాంధీ గారు విచ్చేసి, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ రావు గారు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గోపి ఐఏఎస్ గారితో కలిసి పరిస్థితులను సమీక్షించారు.ఈ సందర్భంగా త్వరితగతిన అధిక సామర్ధ్యం గల నూతన డ్రైనేజ్ పైప్ లైన్ ఏర్పాటు చేసి, అందుకు సంబంధించిన తగు చర్యలు వెంటనే చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం గారు,తలారి వీరేష్ గారు, సీనియర్ నాయకులు శ్రీ కొలన్ గోపాల్ రెడ్డి గారు,రవి కాంత్ గారు, ఇతర ముఖ్య నాయకులు,NMC ఆయా విభాగాల అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.