నిహారిక కొనిదల అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకరింగ్ నుండి షార్ట్ ఫిలింస్ వరకు, వెబ్ సిరీస్ నుండి హీరోయిన్ వరకు అన్నింట్లో తన సత్తా చాటిన నిహారిక ఈ మధ్యనే ప్రోడ్యూసర్‌గా కూడా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది.
తనకు చిరంజీవి గారే స్పూర్తి అని చాలా సార్లు చెప్పింది. నటీమణులకు పెళ్ళి అయినా కూడా ఇప్పుడు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పింది. సమంత అందుకు మంచి ఉదాహరణ అని అంది. తన భర్త కు కూడా తాను సినిమాలు చేయడం ఇష్టమని, అందుకే ఇంకా కంటిన్యూ చేస్తున్నానంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నిహారిక మొన్న జిమ్‌లో తన వర్కవుట్ వీడియో వొకటి ఇన్‌స్టాగ్రాం లో పోస్ట్ చేసింది. ఆ వీడియోకు నెటిజన్‌ల నుండి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వచ్చాయి. ఆతరువాత తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్ డిలీట్ చేసింది. అయితే తను అకౌంట్ డిలీట్ చేయడానికి కారణం ట్రొలింగ్స్ వలనా కాదా అనే విషయం తెలియదు.