ఐఐటీ హైదరాబాద్ లో కొత్త రీసెర్చ్ పార్కు
హైదరాబాద్ ఐఐటీలో కొత్త రీసెర్చ్ పార్కు ఏర్పాటుకు కేంద్రం సమ్మతించిందని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం రాజ్యసభలో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కె. రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ పథకం కింద ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ గౌహతి, ఐఐటీ హైదరాబాద్, ఐఐఎ్‌ససీ బెంగళూరులో రీసెర్చ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో సంస్థకు రూ. 75 కోట్ల చొప్పున ఆర్థిక సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.