కూకట్పల్లి లొ పోలీస్ స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవం, నిరాడంబరంగా ప్రారంభమై, అతికొద్ది మంది పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో, మరియు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , ఎమ్మెల్సీ నవీన్ రావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ , సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ,జాయింట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మాదాపూర్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు,ఏసీపీ లు సురేందర్ రావు ,భుజంగరావు, కూకట్పల్లి సిఐ లక్ష్మీ నారాయణ రెడ్డి,. కే పి హెచ్ పి
సిఐ లక్ష్మీనారాయణ. మరియు ఇతర పోలీసు అధికారులు సమక్షంలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన మూడు అంతస్తుల భవనాన్ని కూకట్పల్లి ప్రధాన రహదారిలో ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ ఆఫీస్ కి ఇచ్చిన స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పోలీస్ స్టేషన్ కు కేటాయించడం హర్షణీయమని . ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభినందించారు ,అలాగే అత్యాధునిక సదుపాయాలతో ఈ పోలీస్ స్టేషన్ నిర్మించడం సంతోషదాయకం అని రానున్న రోజుల్లో కే పి హెచ్ పి
పోలీస్ స్టేషన్ కూడా అత్యాధునిక సౌకర్యాలతో పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు,అలాగే మోతి నగర్ లో కూడా ప్రత్యేక పోలీస్ స్టేషన్ కేటాయిస్తామని ఈసందర్భంగా సీపీ సజ్జనార్ తెలిపారు.
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more