మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ 116 డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ లో ఈ రోజు కాలుష్యం నివారణ కార్యక్రమంలో భాగంగా, 24 లక్షల వ్యయంతో , శ్రీ చైతన్య స్కూల్ నుండి బాబాయ్ గల్లీ వరకు 150, మరియు 200 mm డయా నూతన పైపులైన్ పనులను ఎమ్యెల్యే మాధవరం కృష్ణా రావు యొక్క ఆదేశాల మేరకు, మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దీన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గౌసుద్దీన్ మాట్లాడుతూ, శ్రీ వివేకానంద నగర్ లో నూతన పైప్ లైన్ పనులను ఈరోజు ప్రారంబించడం జరిగింది, ప్రజలకు ఎటువంటి ఇబందులు తలెత్తకుండా, అన్ని వసతులతో కూడిన జీవనాన్ని జీవించాలని,డివిజన్ లొని ప్రతీ బస్తీ మరియు కాలనీ లను ఆధునిక వసతులతో తీర్చిదిద్దే బాధ్యత మా పైన ఉంది, వాటి కోసం నిరంతరం శ్రమిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కో ఆర్డినటర్ వీరా రెడ్డి, రొనంకి జగన్నాధం ,కేశవ రావు,రవీందర్ రెడ్డి,లక్ష్మీ, చెల్లయ్య,జగన్,తదితరులు పాల్గొన్నారు.