ఉప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గ, చిల్కానగర్ డివిజన్లోని నోవా ఫంక్షన్ హాల్ లో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి సందర్భంగా శ్రీ నూతన గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని మంగళవారం రోజున నిర్వహించారు. మొదటగా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్, కార్పొరేటర్లు కొత్త శ్రీ విద్య చక్రపాణి గౌడ్, అంజలి శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ మాట్లాడుతూ.. శ్రీ నూతన గౌడ సంఘ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది, గౌడ కులం యొక్క అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న గౌడ సోదరీ సోదరీమణులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీ నూతన గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. శ్రీ నూతన గౌడ సంఘం
అధ్యక్షులు పటేల్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. గౌడకులంలో నిరుపేద విద్యార్థినీ విద్యార్థులకు గ్రూప్స్ పరీక్షలు రాయడానికి ప్రత్యేకమైన కోచింగ్ ఇవ్వడంతోపాటు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించే ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. అదేవిధంగా గౌడ కులం లోని పేదింటి ఆడపిల్ల పెళ్ళికి పుస్తే మట్టెలు బహుమానంగా ఇస్తాము,ఎవరైనా ప్రమాదవశాత్తు తాడి చెట్టు నుండి జారిపడిన లేదా మరణించిన వారి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా శ్రీ నూతన గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ద్వారా అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అన్ని రంగాల్లో గౌడ కులం యొక్క అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా గౌడ కుల నాయకులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీ నూతన గౌడ సంఘం అధ్యక్షులు పటేల్ వెంకటేష్ గౌడ్, మాచర్ల మొగిలి గౌడ్,ఉపేందర్ గౌడ్, రమేష్ గౌడ్, సూర్య నారాయణ గౌడ్, విజయ్ గౌడ్, అరవింద్ గౌడ్, రాజేందర్ గౌడ్, కనకరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు