ఇది మెట్రో ప్రయాణీకులకు ఒక శుభవార్త. మెట్రో స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళడానికి
ఇప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి ఆటోలోనో, క్యాబ్ లోనో ఇంటికి వెళ్తున్నారా? అయితే ఇప్పుడు మెట్రో వారే తమ ఆటోలను ఏర్పాటు చేశారు. ఇందులో సాధారణ ఆటోల కంటే చాలా తక్కువగా చార్జీలు ఉంటాయి.
ఆటోను బుక్ చేసుకోవడానికి మెట్రోరైడ్ ఇండియా అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొదటి కిలోమీటర్‌కు 10 రూపాయలు తర్వాత ప్రతి కిలో మీటరుకు ఆరు రూపాయలు చార్జీలు వసూలు చేస్తారు. ఇప్పడివరకు పరేడ్ గ్రౌండ్స్, రాయదుర్గం మెట్రో స్టేషన్లలో 50 ఎలక్ట్రికల్ ఆటలతో ఈ ఆటోలను ప్రారంభిస్తున్నారు. ముందు ముందు అన్ని మెట్రో స్టేషన్లకు ఈ సేవలు విస్తరిస్తామని చెప్పారు.