• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

జాతీయ బీసీదళ్‌ అద్వ్వర్యము లో జనగణనలో- కులగణన’’ పై జాతీయ స్థాయిలో చర్చావేదిక

AdminbyAdmin
16/12/2022
inNews
0
జాతీయ బీసీదళ్‌ అద్వ్వర్యము లో జనగణనలో- కులగణన’’ పై జాతీయ స్థాయిలో చర్చావేదిక

జాతీయ బీసీదళ్‌ అద్వ్వర్యము లో జనగణనలో- కులగణన’’చర్చావేదిక ఏర్పాటు చేయడం జరిగినధి

కులగణన చేపట్టకపోతే మరో స్వాతంత్య్ర సమరమే- బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్

*‘‘జనగణనలో- కులగణన’’ చర్చావేదికలో - రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు*
       - 
*బీసీలంటే లెక్కలేదు, అందుకే లెక్కలు తీయడం లేదా?జాతీయ బీసీదళ్‌ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి*

దశాబ్దాల బీసీల డిమాండ్‌ను మన్నించక పోవడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?పశువుల కన్నా హీనంగా చూడడం దుర్మార్గం కాదా- జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు కుమారస్వామి

దశాబ్దాలుగా మా లెక్కలను తీసి మా జీవితాలను బాగుపరచండని కోరుతున్న బీసీలను నిర్లక్ష్యం చేయడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అవేదన వ్యక్తం చేశారు. ఈ డిమాండ్‌ దిశగా బీసీ వర్గాల నుండి పెల్లుబికి వస్తున్న నిరసన, జాతీయ స్థాయిలో మరో స్వాతంత్య్ర సమరంలా ఉద్భవించేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక స్థితిగతులను సమగ్రంగా సేకరించడానికి కులగణనను చేపట్టాల్సిన మోడీ ప్రభుత్వం కులగణన చేయలేమని ప్రకటించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు.
మంగళవారం నాడు స్థానిక కాచిగూడలోని అభినందన గ్రాండ్‌ హోటల్‌లో జాతీయ బీసీదళ్‌ ఆధ్వర్యంలో ‘‘జనగణనలో`కులగణన’’ పై చర్చావేదికను నిర్వహించారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా జాతీయ బీసీదళ్‌ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి వ్యవహరించారు. ఈ అంశంపై వివిధ బీసీ సంఘాల ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, తత్వవేత్తలు, న్యాయవాదులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు పాల్గొని ప్రసంగించారు. అన్ని సమస్యలకు ఒకే మందు ‘‘కులగణన’’ చేపట్టడమే పరిష్కారం అని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చర్చావేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రసంగిస్తూ....గతంలో చేపట్టిన కులగణనకు వెచ్చించిన 5వేల కోట్ల రూపాయలు నిష్ఫలం చేయడానికి కేంద్రం సిద్ధపడిరదే కాని, గత లెక్కలను బయటపెట్టడానికి ముందుకు రాకపోవడం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ లక్షణం కాదు అన్నారు. కులాల వారిగా లెక్కలు తీసి ప్రకటించినప్పుడే రిజర్వేషన్లలో, బడ్జెట్‌లలో, ప్రణాళికల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేయడం సాధ్యమవుతుందన్నారు.
సుప్రీం కోర్టు ఈ నేపథ్యంగానే బీసీల లెక్కలు తీయాలని ఆదేశించిందన్నారు. అలా కులాల వారిగా లెక్కలను గ్రామస్థాయి నుండి మండల, జిల్లా, రాష్ట్రాలు అలా అన్ని స్థాయిలలో విడివిడిగా సేకరించడం జరుగుతుందన్నారు. వాటన్నింటిని కలిపి జాతీయ స్థాయిలో జనాభా స్థాయిని సమగ్రంగా నిర్ధారించవచ్చు అన్నారు. అలా అప్పుడే అన్ని రంగాలలో బీసీల జనాభాకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్‌లు ఏమేరకు ఉండాలి అనే అంశంపై ‘‘శాస్త్రీయ` ప్రాతిపదిక’’ ఏర్పడుతుందన్నారు. ఇలాంటి సమగ్రమైన చర్యలతో పేదరికం, వెనుకబాటుతనం, అసమానతలు తొలగించడానికి పకడ్బంది ప్రణాళిక రచనతో ముందుకెళ్ళడానికి వీలుంటుందని డాక్టర్‌ వకుళాభరణం అభిప్రాయపడ్డారు. ఎందుచేతనో బీసీలనుండి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన నరేంద్రమోడి ప్రభుత్వం బీసీలు కోరుతున్న డిమాండ్‌ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం ఈ వర్గాల ప్రజల పట్ల మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందన్నారు.
గతంలోని 2011 కులగణన వివరాలను గోప్యంగా ఉంచడం వలన ఈ ప్రభుత్వం సాధించేది ఏమి లేదన్నారు.  దేశంలో రిజర్వేషన్‌ల అమలులో నెలకొంటున్న గందరగోళాన్ని నివారించడానికి ఆ లెక్కలనైనా ఉపయోగపడతాయన్నారు. ఒకవేళ గత లెక్కలు ప్రకటిచలేని విధంగా ఉంటే,  వెంటనే త్వరలో జరిగే జనాభా గణనలోనైనా కులగణన చేపట్టాలని వకుళాభరణం డిమాండ్‌ చేశారు.
కులాల వారీగా లెక్కలు తీయకుండా గంపగుత్తగా శాంపిల్‌ సర్వేలతో సంక్షేమ పథకాలు, రిజర్వేషన్‌లను అమలులోని తేవడం వలన ప్రయోజనాలు తక్కువేనని ఇప్పటికే తేలిపోయిందన్నారు. అంతేగాక రిజర్వేషన్‌ల అమలుకు శాతాల స్థిరీకరణలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానాలలో వీగిపోతున్నాయని డాక్టర్‌ వకుళాభరణం పేర్కొన్నారు.
సమగ్రంగా అధ్యయనం చేసి, శాస్త్రీయంగా సేకరించిన కులగణన వివరాలనే ‘‘పరిమాణాత్మక సమాచారం’’గా గుర్తిస్తామని సుప్రీంకోర్టు స్పష్టంచేసి, కులగణన చేయాలని సూచించినప్పటికీ  కేంద్రం పెడచెవిన పెట్టడం సబబు కాదని అన్నారు. దేశంలోని సుప్రీంకోర్టును గౌరవించకుండా, 56% బీసీ జనాభా విజ్ఞప్తులను మన్నించకుండా మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామనడం ప్రజాప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

*బీసీదళ్‌ జాతీయ అధ్యక్షుడు దుండ్రకుమారస్వామి ప్రసంగిస్తూ*

.
పశువుల, వన్య ప్రాణుల లెక్కలను క్రమం తప్పకుండా తీసే ప్రభుత్వానికి, బీసీ లెక్కలు తీయాలన్న విజ్ఞతను కనబరచపోవడం అమానవీయం అన్నారు. బీసీలను పశువులకన్నా తక్కువచేసి చూడడం దుర్మార్గం కాకపోతే మరేమవుతుందని అన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నారన్నారు. నరేంద్రమోడి ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. కులగణన చేపట్టాలని ఏళ్ళతరబడిగా పోరుబాట పట్టినప్పటికీ ప్రజా ఉద్యమాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఇది ఫాసిస్ట్‌ ప్రభుత్వం లక్షణం కాక మరేమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈయనేం బీసీ ప్రధానమంత్రి అని ఆయన అన్నారు. దేశంలో మెజారిటీ ప్రజలైన బీసీల అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలేసి మాది ప్రజారంజక ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. హక్కుల సాధనకు ఉద్యమించిన రైతులను జైళ్ళపాలు చేశారు. ఉద్యమకారులపై పి.డి., ఉగ్రవాద చట్టాలను అమలు చేశారు. ఇలాంటి చర్యలు గతంలో ఎప్పుడూ ఈ దేశంలోని ప్రజలు ఎదుర్కొలేదన్నారు. ఇప్పటికైనా బీసీల ప్రధాన డిమాండ్‌ అయిన కులగణనను చెపట్టకపోతే జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈచర్చావేదికలో పాల్గొని ప్రసంగించిన ప్రతినిధులలో డా॥భాగయ్య, గాదె సమ్మయ్య, ఫ్రొఫెసర్‌ మాధవి, ప్రొఫెసర్‌ రేఖ, డా॥శ్రీనివాస్‌ నోముల, డా॥ నాంపెల్లి శ్రీనివాస్‌, డా॥ కె. రఘుపతి, ప్రొ॥ వీరనారాయణ, ప్రొ॥ లలిత్‌ఆదిత్య, డా॥ శివాంశ్‌, ప్రొ॥ చక్రధర్‌, డా॥ సాక్షి శివాని, డా॥ ప్రణాచాడ, ప్రొ॥ దివాకర్‌రావు, డా॥ ఆశాప్రియ మున్నగువారు పాల్గొన్నారు. రమణ యాదవ్, రాజేష్ యాదవ్, గణపురం పద్మ, దివ్య, సుభాష్, కేశవ్,చరణ్, తదితరులు పాల్గొన్నారు.

Tags: #dundrakumaraswamy #kumaraswamydundra #bcdal bcleadersBJPBrsCongressDundraDundrakumaraswamyHyderabadKumaraswamytrendingTRSచర్చావేదికలజనగణనలో- కులగణన’’ పై జాతీయ స్థాయిలో
Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News