రంగారెడ్డి జిల్లాలో శేర్లింగంపల్లి మండలానికి చెందిన మాదాపూర్ లో స్మైల్ డెంటల్ హాస్పిటల్ లో జాతీయ దంత వైద్య లా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు హైదరాబాద్ స్మైల్స్ యాజమాన్యం డాక్టర్ దిలీప్ కుమార్ నాగదీపిక ఆధ్వర్యంలో హాస్పటల్లోని దంత వైద్యులకు బిసిదల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఘనంగా సత్కరించారు .ఈ సందర్భంగా ప్రముఖ దంత వైద్యుడు దిలీప్ కుమార్ మాట్లాడుతూ నోటికి వ్యాయామం లేక కుదించుకుపోతున్న దవడలు
ఆహారం నమిలే అలవాటు లేకే జ్ఞాన దంతాలకు ఆటంకం,దంత కేన్సర్‌లో మూడో స్థానంలో హైదరాబాద్ ఉండటం చాలా బాధ బాధాకరమని తెలియజేశాడు.
చిన్న వయసులో ఆహారాన్ని ఎక్కువగా నమిలే అలవాటు లేకపోవడం, నమలాల్సిన అవసరం లేని ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్ల వంటివి ఎక్కువగా తినడం వల్ల నోటికి సరైన వ్యాయమం ఉండటం లేదు.దాని వలన
దవడలు కుచించుకుపోయి జ్ఞాన దంతాలు రావడం లేదని తెలియజేశాడు.ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో దంత కేన్సర్ ఎక్కువగా నమోదవుతోంది. పొగాకు ఉత్పత్తులు, జర్దా, పాన్, గుట్కాలు ఎక్కువగా నమలడమే అందుకు కారణం. దంత కేన్సర్ బాధితుల్లో హైదరాబాద్ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఇందులో అహ్మదాబాద్, ముంబై తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.
నమిలి మింగకపోవడం వల్లే ఆహారాన్ని నమిలి మింగే అలవాటు లేకపోవడం వల్ల దవడల పరిమాణం తగ్గిపోతున్నట్లు తెలియజేశాడు .
బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ హైదరాబాద్ స్మైల్స్ లో ఆధునిక పరికరాలు మరియు నైపుణ్యంగల దంత వైద్యుల బృందం కలిగి ఉండటం చాలా సంతోషం అని తెలియజేశాడు . దంత వైద్య రంగంలో మరింత ముందుకు ముందుకు సాగాలి అని ఎంతోమందికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
నేటితరం యువతలో చాలా మందికి జ్ఞాన దంతాలు కనిపించకపోవడం ,ఎగుడు దిగుడుగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలియజేశాడు . అంతేకాదు .ఆహారాన్ని ఎక్కువగా నమలకుండా మింగేయడం వల్ల నోట్లో ఊరే లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతోంది. తద్వారా ‘హెచ్‌పైలోరే’ అనే బ్యాక్టీరియా జీర్ణాశయంలోకి చేరి అజీర్తి, అల్సర్లకు కారణమవుతోంది తెలియచేశాడు .ఈ కార్యక్రమంలో మిగతా దంత వైద్యులు పాల్గొనడం జరిగింది.
