*జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అధ్వర్యంలో శ్రీ త్యాగరాయ గాన సభలో నిర్వహించిన ‘‘ సిద్ధాంత భావజాల వ్యాప్తి బీసీ ఉద్యమ చైతన్య స్ఫూర్తి’’ అంశంపై జరిగిన జాతీయ సదస్సు- *బలమైన సామాజిక ఉద్యమాలు-‘‘ సిద్ధాంత భావజాల వ్యాప్తి తో సాధ్యం- దుండ్ర కుమారస్వామి *సిద్ధాంత భావజాలం వ్యాప్తితోనే బీసీల అభివృద్ధి బీసీ సిద్ధాంత భావజాలం.. బీసీల అభివృద్ధికి తోడ్పాటును అందించాలి. బీసీల అభ్యున్నతికి పాటు పడేలా ముందుకు ఎలా సాగాలి..? ఏమి చేస్తే చైతన్యం వస్తుంది..? అన్నదే బీసీ సిద్ధాంత భావజాలంలో ఉంటుంది. ఎన్నో దశబ్దాలుగా బీసీలు దేశంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అట్టడుగున ఉండిపోయారు. వారిలో సామాజికంగా చైతన్యం తీసుకుని రావాలి. రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి. బీసీలు అంటే ఎప్పుడూ పల్లకీ మోసే బోయవాళ్లు మాత్రమే కాదని, సింహాసనం అధిరోహించే సత్తా ఉన్నవాళ్లు అనే స్పూర్తి ప్రతి ఒక్కరి మనస్సుల్లో బలంగా నాటడమే బీసీ సిద్ధాంత భావాజాలం. అది కూడా సైద్ధాంతికంగా..! బీసీ సంక్షేమ సంఘాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి.ఎందులోనూ బీసీలు తక్కువ కాదని నిరూపించిన నాడే బీసీ సిద్ధాంత భావజాలానికి ఒక చిరునామా తెచ్చిన వాళ్ళము అవుతాము. ఎవరి కుల జనాభా ప్రకారం వారు హక్కులు పొందటమే ప్రజాస్వామిక సామాజిక న్యాయమని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయం. ఆ మహానుభావుడు ఆశించినట్లుగానే మనం ఆ దిశగా అడుగులు వేస్తున్నామా లేదా..? అన్నది కూడా తెలుస్తుంది. ప్రజాస్వామ్య భారతంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక రంగాలతో పాటు వివిధ రంగాల్లో వెనకబడిన కులాలకు తగిన ప్రాతినిధ్యం లభించినప్పుడే సామాజిక న్యాయం అనే మాటకు సంపూర్ణత చేకూరుతుంది. బీసీ సిద్ధాంత భావజాలానికి కూడా ఒక సార్థకత ఉంటుంది. మండల్ కమిషన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసి ఉంటే బీసీల పరిస్థితి నేడు ఇలా ఉండేది కాదు. కానీ అవేవీ జరగలేదు సరికదా బీసీలను ఏళ్ళ తరబడి ఓట్ల కోసం వాడుకుంటూ ఉన్నారు. దశబ్దాల తరబడి వెనుకబడిన కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని అనుక్షణం గుర్తుచేస్తూ బీసీలను జాగరుకులను చేయడం కూడా బీసీ సిద్ధాంత భావజాల వ్యాప్తిలో ఒక భాగమే..! ఎన్నికలు వచ్చాయంటే చాలు బీసీలకు అది చేసేస్తాం... ఇది చేసేస్తాం అని రాజకీయ నాయకులు ప్రగల్బాలు పలుకుతారు. కానీ ఎన్నికలు ముగిశాక శరామామూలే. అదీ ఇదీ కాదు అస్సలు ఏదీ చేయరు. ఓటు బ్యాంకు కోసం రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలకు దేశంలోని అనేక కులాలను బీసీ జాబితాలో చేర్చారు. కానీ దేశానికి స్వతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా నేటికీ బీసీల రిజర్వేషన్లు 27 శాతానికి మించకపోడం విచారకరం. బీసీల జన గణన చేయమంటే సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. రాజకీయ పార్టీల బీసీల పట్ల ఉన్న చిత్త శుద్ధి ఏపాటితో తేటతెల్లం అవుతుంది. రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోడానికి ఎన్నికల వేళా బీసీ కార్డును ఓ హస్త్రంగా వాడుతున్నాయి. ఇప్పటికే బీసీలు ఇలాంటివి ఎన్నో చేదు అనుభవాలను భరిస్తూ వచ్చారు. ఇక భావితరాలు వంచనకు గురికాకుండా ఉండేందుకు నేటి తరం బాల్యానికి కూడా వివరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. నేటి పోరాటాలతో మన భవిష్యత్ తరాలకైనా ప్రతిఫలం అందుతుందనే ఓ చిన్న ఆశ. కుల గణనతోనే బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని, ఆ దుస్థితి మారాలి అంటే రాజ్యాధికారం సాధనే బీసీల ముందు ఉన్న ఏకైక లక్ష్యం. అందుకు దేశంలోని బీసీలను అందరిని ఏకతాటిపైకి తేవడమే మా ప్రథాన ధ్యేయం. బీసీలలో చైతన్యం రగిలించేందుకు నడుము బిగించాల్సిన అవసరం ఉంది. విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక, సామాజికంగా ఇలా అన్ని రంగాల్లో బీసీల అభివఅద్ధి సాధ్యమైనప్పుడే బీసీ సిద్ధాంత భావజాలానికి ఒక సార్థకత అంటూ ఉంటుంది. శనివారం నాడు చిక్కడపల్లి లోని శ్రీ త్యాగరాయ గాన సభలో జాతీయ బీసీ దళ్ అధ్వర్యంలో నిర్వహించిన ‘‘ సిద్ధాంత భావజాల వ్యాప్తి
బీసీ ఉద్యమ చైతన్య స్ఫూర్తి’’ అంశంపై జరిగిన జాతీయ సదస్సులో డా॥ వకుళాభరణం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డా॥వకుళాభరణం ప్రసంగిస్తూ…. హక్కుల సాధనకు ప్రజలను సిద్ధం చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి ఆకర్షణీయమైన ఉద్యమ నీతి, రీతి ఉండాలన్నారు. సందర్భం అనుసారంగా నినాదాలు, ఉద్యమ పంథా, కాలనిర్ణయ పట్టిక,ఉద్యమ విధానాల్లో, వివిధ పద్దతులు అవలంభించాల్సి వస్తుందన్నారు. ఇలాంటి మౌలికమైన విషయాలలో స్పష్టతతో, రూపొందించుకున్న ‘‘సిద్ధాంతం’’తోనే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. మహాత్మగాంధీ, మహాత్మ జాతిభాపూలే, నారాయణగురు, పెరియార్ రామస్వామి నాయకర్, డా॥ బీఆర్ అంబేద్కర్, రాంమనోహర్ లోహియా, భాగ్యరెడ్డివర్మ మున్నగు మహనీయుల ఉద్యమ స్ఫూర్తి చరిత్ర మరువలేనిది అన్నారు. తాత్కాలికమైన డిమాండ్‌ల పరిష్కారానికి చేసే ఉద్యమాలు, తాత్కాలిక ఉపశమనాలతో ముగిసిపోతాయన్నారు. అదే నిర్ధిష్ట సిద్ధాంతంతో నిర్మించిన ఉద్యమాలు లక్ష్యించిన ఆశయాల్ని సాధించి, గెలుపు బావుటా ఎగరవేస్తాయని ఆయన పేర్కొన్నారు. బీసీల హక్కులు, ప్రయోజనాల నిమిత్తం చేసే ఉద్యమాలు సమస్యల పరిష్కారంతో ఆగిపోకూడదని ఆయన అన్నారు. రాజ్యాధికార దిశగా సాగించే పోరాటాలు నిర్దిష్టమైన సిద్ధాంతం, అమలుతో సాధించడానికి కృషి చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమం లో పలు బీసీ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more