Press note: 20/03/2022
*ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ స్వర్ణలత ,D.M, ( నిమ్స్ హాస్పిటల్), జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి, ప్రణయ్ కుమార్,
తెలంగాణ ఉప్పల్ శిల్పారామం లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు సందర్భంగా స్వర రాగ నిరాజనం సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో మహిళా అవార్డ్స్ మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్, మహిళ సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి . దుండ్ర కుమారస్వామి మరియు డాక్టర్ స్వర్ణలత, దీపా ప్రజ్వలన ప్రారంభం చేసి కార్యక్రమాలను మొదలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత పై గీతం, గణపతి శ్లోకం మాతృమూర్తి నాటిక ప్రదర్శన అన్నమాచార్య కీర్తనలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ స్వర్ణలత,మరియు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు మరియు అతిథులుగా డిప్యూటీ సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ ట్రాన్స్కో నాగభూషణం, జి కృష్ణవేణి రిటైర్డ్ అడిషనల్ సెక్రటరీ, డాక్టర్ సరళ కుమారి హోమియోపతి డాక్టర్, జి పద్మ పౌండేషన్ ప్రెసిడెంట్ ,అలివేలు మంగ -సోషల్ వర్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్న వారికి మరియు సమాజంలో లో అన్ని రంగాలలో కృషిచేసిన మహిళలను గుర్తించి వారికి మహిళాఅవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బీసీ దల్ అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ ఉదయం లేచిన కాడినుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం కంటికి రెప్పలా కాపాడే శక్తి అమ్మ, ఒక స్త్రీ అని తెలియజేశాడు. అమ్మగా, ఆలిగా,చెల్లిగా చెలియగా మగ వారికి ఏదో ఒక రూపంలో నడిపిస్తున్న బంధం ఒక స్త్రీ అని తెలియజేశాడు. అందుకే అమ్మను పూజించాలి, భార్యను ప్రేమించాలి, ముఖ్యంగా మహిళలు అందరినీ గౌరవించాలి అని చెప్పాడు. స్త్రీ అంటే త్యాగానికి గొప్ప నిర్వచనం స్త్రీ లేనిది అంతా శూన్యం స్త్రీ సృష్టికే ఓ కానుక అని తెలియజేస్తూ స్త్రీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలి అని తెలియజేశాడు. జనాభాలో 50% ఉన్న మహిళలు, పార్లమెంటు అసెంబ్లీ లో ప్రాతినిధ్యం 15% – 17% ప్రాతినిధ్యం దాటలేదు ఈ విషయాన్ని ఆలోచించాల్సిన సందర్భంగా ఏర్పడదని తెలియజేశారు. చట్టసభల్లో మహిళా బిల్లు సాధించుకోవాలి. మహిళలకు సమాన అవకాశాలు రావాలని తెలియజేశాడు. స్వాతంత్రం రాక ముందు మహిళలకు సామాజిక కట్టుబాట్లతో వంటింటికే పరిమితం అయ్యారు కానీ ఇప్పుడు మగవారికి దీటుగా అన్ని రంగాలలో పోటీతత్వాన్ని నింపారు,నింగికి ఎగిసారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు.
