సోషల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
తనకు దక్కిన గౌరవంపై జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. తండ్రి ఆశయ సాధన కోసం పరితపించే వ్యక్తులు అత్యంత అరుదుగా ఉంటారు. భువన సంజయ్ ఆ కోవకు చెందిన వారే.. 1966 లో ఉద్భవించిన శ్రీ ఆర్.వి.ఆర్. మూర్తి ముద్దుబిడ్డ ‘కళావేదిక’ 50 సంవత్సరాలకు పైగా అవిశ్రాంతంగా ముందుకు సాగుతోందంటే అందుకు కారణం ఆయన కుమార్తె. వివిధ కళారూపాలకు ప్రాణం పోసి దేశ విదేశాల్లో అజరామర కీర్తి సాధించిన శ్రీ ఆర్.వి.ఆర్. మూర్తి కుమార్తె భువనను ఎవరు అభినందించరు చెప్పండి.
రాజకీయ, సినీ, కళా రంగాలలోని వివిధ మహోన్నత వ్యక్తులను సత్కరిస్తూ వస్తున్నారు. ఆర్.వి.ఆర్. మూర్తి అడుగుజాడల్లో నడుస్తూ.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా కళావేదికను తీర్చిదిద్దుతున్న భువన సంజయ్ మరిన్ని సంవత్సరాలు కళావేదికను ముందుకు తీసుకుని వెళతారని ఆశిస్తూ ఉన్నానని అన్నారు దుండ్ర కుమారస్వామి. ఆమె కళావేదికను ఎంతో ఎత్తుకు నిలబెడతారనే గట్టి నమ్మకం తనకు ఉందని అన్నారు దుండ్ర కుమారస్వామి.
సోషల్ పెర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు తనలో మరింత బాధ్యతను పెంచిందని దుండ్ర కుమారస్వామి అన్నారు. అంబేద్కర్ స్పూర్తితో వచ్చే సంవత్సరంలో మరిన్ని గొప్ప పనులు చేయటమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. చేతనైనంత మందికి సాయం చేస్తానని.. అభాగ్యులకు అండగా నిలుస్తానని ఈ వేదిక సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ సమాజం అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు దుండ్ర కుమారస్వామి. సోషల్ పెర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చిన బూస్ట్ తో రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పనులు చేస్తామని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. 2023లో మేము చేయబోయే కార్యక్రమాలు జాతిని సంఘటితం చేయబోతున్నాయని దుండ్ర కుమారస్వామి వెల్లడించారు.