తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 % ఉన్న బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామిస్వామి కోరారు.శుక్రవారం సాయంత్రం ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసిన ఆయన, బీసీల అభ్యున్నతికి మెమోరాండం అంద చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా ఏడాదికి 20 వేల కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని, ఉప ప్రణాళికను అమలు చేయాలని, అలాగే రాష్ట్ర జనాభాలో 54% ఉన్న బీసీలకు క్యాబినెట్లో మంత్రి పదవులలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దేశంలోని ఇతర రాష్ట్రాల తరహాలో బి.సిల కులగణన ప్రక్రియను చేస్తేనే బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది అని ఈ సంధర్భంగా తెలిపారు.
సానుకూలంగా స్పందించిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, “బీసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది” అని తెలిపారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more