నిమ్స్ లో వినాయక చవితి సంబరాలు ఘనంగా జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
నిమ్స్ లో వినాయక చవితి సంబరాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ నిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు. పండితుల ఆశీర్వచనం ఆయన తీసుకున్నారు. విఘ్నేశ్వరుడి సమక్షంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు. దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. నిమ్స్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అండగా నిలుస్తూ ఉన్నారని కొనియాడారు. ఆసుపత్రిలో సదుపాయాలు కూడా బాగా మెరుగుపడ్డాయని అన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో నిమ్స్ లో అందించిన సేవలు అభినందనీయమని.. వేల మంది ప్రాణాలను కాపాడారని అన్నారు. మరో వైపు హిందూ సంస్కృతిని కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడం చాలా గొప్ప అని దుండ్ర కుమారస్వామి అన్నారు. నిమ్స్ లో నిర్వహించిన వినాయకచవితి వేడుకలకు తనను ఆహ్వానించడం అదృష్టమని చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిమ్స్ డిప్యూటీ రిజిస్టర్ పి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఘనంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని.. కరోనా కారణంగా మధ్యలో కాస్త బ్రేక్ పడిందని.. ఈ ఏడాది ఏర్పాట్లు అద్భుతంగా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన దుండ్ర కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపారు.
మహిళా సంక్షేమ సంఘం గంగాపురం పద్మ మాట్లాడుతూ ప్రజలకు ఆ దేవుడి కృప ఉండాలని.. ఎన్నో కష్టాల నుండి ప్రజలను ఆ వినాయకుడు బయట పడేస్తారని చెప్పుకొచ్చారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎం నాగరాజు, వేణుగోపాల స్వామి, ఇతర నిమ్స్ ఉద్యోగులు పాల్గొన్నారు.