తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైన తీగల రాంప్రసాద్ గౌడ్ ను సన్మానించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైన తీగల రాంప్రసాద్ గౌడ్ ను జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అభినందించారు. తీగల రాంప్రసాద్ గౌడ్ సాధించిన ఘనత ఎంతో మందికి ఆదర్శమని దుండ్ర కుమారస్వామి అన్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది తీగల రాంప్రసాద్ గౌడ్ ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైనందుకు సంతోషంగా ఉందని దుండ్ర కుమారస్వామి అన్నారు. న్యాయవాదిగా రాంప్రసాద్ గౌడ్ ఎంతో మందికి తన వంతు సహాయం చేశారని.. ప్రతి వ్యక్తికి సమానంగా న్యాయం,స్వేచ్ఛా, సమానత్వం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వ్యక్తి తీగల రాంప్రసాద్ గౌడ్ అని దుండ్ర కుమారస్వామి కొనియాడారు. ఈరోజు ఆయన తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారంటే అందుకోసం ఆయన పడిన కష్టం, చేసిన త్యాగాలు మరువలేనివని అన్నారు దుండ్ర కుమారస్వామి. పేదవారికి న్యాయం అందించడానికి తీగల రాంప్రసాద్ గౌడ్ చేస్తున్న కృషి అభినందనీయమని.. ఆయన సాధించిన ఘనతను ఎంతో మంది పేద విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కుమారస్వామి అన్నారు. తీగల రాంప్రసాద్ గౌడ్ మరిన్ని విజయాలు సాధించాలని.. మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు తగినన్ని రిజర్వేషన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని దుండ్ర కుమారస్వామి అన్నారు. బీసీ విద్యార్థులు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే బాగా చదవాలని.. కెరీర్ విషయంలో ఒక లక్ష్యాన్ని మదిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.