తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు పుట్టినరోజు నేడు. ఆయనకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సన్మానించి.. వకుళాభరణం కృష్ణమోహన్ రావు గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోనూ, మంచి ఆరోగ్యంతో ఉండి బీసీల కోసం మరింత గొప్ప పనులు చేయాలని కోరారు.
బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ బీసీల కోసం తెలంగాణ రాష్ట్రంలో పాటు పడుతున్న గొప్ప వ్యక్తులలో వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఒకరని.. ఆయన 53వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న వకుళాభరణం కృష్ణమోహన్ రావు రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప పనులు చేయాలని కోరుకుంటూ ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీలపై చూపెడుతున్న పక్షపాత ధోరణిని ఆయన ఇటీవలే ఎండగడుతూ లేఖ రాశారని, కృష్ణమోహన్ రావులో ఉన్న ఫైర్ దేశంలోని వివిధ బీసీ సంఘాల నేతల్లో కూడా రావాలని అన్నారు. బీసీలను మోసం చేస్తూ, కాలం వెళ్లబుచ్చే నాయకుల కాలర్ ను ప్రజలు పట్టుకుని అడిగే రోజు అతి దగ్గరలోనే వకుళాభరణం కృష్ణమోహన్ రావు నాయకత్వంలో వస్తుందని ఆకాంక్షించారు. బీసీ కులగణన ఆవశ్యకత విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి ఆయన ఎంతో మందిని చైతన్యపరుస్తూ ఉన్నారని.. సమాజ శ్రేయస్సు కోసం ఆకాంక్షించే గొప్ప వ్యక్తి వెంట మనమంతా కలిసి అడుగులు వేయాలని దుండ్ర కుమారస్వామి అన్నారు.
బీసీ ఉద్యమంలో పాల్గొనడం మొదలు.. మూడు సార్లు బీసీ కమిషన్ మెంబర్‌గా పని చేసిన వ్యక్తి వకుళాభరణం కృష్ణమోహన్ రావు అని చెప్పారు దుండ్ర కుమారస్వామి. ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2009 వరకు రెండు సార్లు, తెలంగాణలో తొలి కమిషన్‌లో మెంబర్ ఉన్నారని ఆ తర్వాత చైర్మన్ గా ఎదిగారని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఆయన రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని దుండ్ర కుమారస్వామి ఆకాంక్షించారు. కార్యక్రమంలో బిసి దళ్ గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుందర్, రాజీవ్, సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ శివ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు పద్మ, కేశవ రాజు దివ్య స్వప్న కవిత, రమణ, మహేష్,తదితరులు పాల్గొన్నారు