
జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు, దుండ్ర కుమారస్వామి పుట్టిన రోజు వేడుకలను శుక్రవారము రోజున బిసి దళ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శేర్లింగంపల్లి లో నిర్వహించారు. బీసీ దళ్ మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్యాలయంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం వివిధ ఆలయాల్లో దుండ్ర కుమారస్వామి పేరుమీద ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర కమిటీ మరియు కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అలాగే వివిధ నియోజకవర్గంల నుంచి అనేక మంది నేతలు కార్యకర్తలు శేర్లింగంపల్లి కి వెళ్లి బీసీ నాయకుడు దుండ్ర కుమారస్వామికి గజమాలలు, శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. బిసిలకు అధికారం రావాలంటే పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి రిజర్వేషన్లు కల్పించాలన్నారు .చట్టసభల్లో 50 శాతం వాటా, కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే వరకూ, మరియు జనాభా గణనలో కుల గణన చేసే వరకు పోరాటం ఆగదు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీ కృష్ణయ్య మరియు బోడ జనార్ధన్ , హోప్ ఫౌండేషన్ అధినేత విజయ్, వట్టినాగులపల్లి మాజీ సర్పంచ్ నగేష్ గారు, మున్సిపల్ చైర్మన్ నర్సింగ్ యాదగిరి రేఖ,తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డిపి చారి, కార్యదర్శి ప్రశాంత్, స్టేట్ కమిటీ మెంబర్ ఐలయ్య గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుందర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్లపోతు భగవాన్ దాసు, రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్, ఆగం ,యాదగిరి,రాజు యాదవ్ ,చరణ్ ప్రవీణ్ మరియు
రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.