దేశం మెచ్చే సింగర్లుగా ఎదగాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
భారతీయ సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఎంతో మంది అద్భుతమైన సింగర్లు మన దేశం నుండి వస్తున్నారు. మొన్ననే మన తెలుగు చిత్రం ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ విశ్వ వేదికపై మెరిసింది, ,గోల్డెన్ గ్లోబ్స్ ఆస్కార్స్ లో సత్తా చాటింది. అని అన్నారు. చిక్కడ పల్లిలోని త్యాగరాయ గాన సభలో మహి మ్యూజికల్ ఈవెంట్స్ సీజన్ 13ను మహేశ్వరి నిర్వహించడం.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, ప్రత్యేక అతిథులుగా మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ ఫిట్నెస్ అను పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
హాజరవ్వడం ఎంతో ఆనందంగా ఉందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. ఎంతో మంది అద్భుతమైన కళాకారులు మన దగ్గర ఉన్నారు. వాళ్లంతా ఇలాంటి వేదికల నుండే పైకి ఎదుగుతూ ఉన్నారు. 9-5 జాబ్స్ చేయడం మాత్రమే కాదు.. మిగిలిన సమయాల్లో కూడా పాటల మీద ప్రేమతో ఎన్నో పోటీలలో పాల్గొంటూ గుర్తింపు తెచ్చుకోడానికి తహతహలాడుతూ ఉన్నారు. వారందరూ ఎదగాలి.. ఎదిగి గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించుకోవాలని దుండ్ర కుమారస్వామి అన్నారు.
సంగీతాన్ని నమ్ముకుని కెరీర్ ను మొదలు పెడుతున్న ఎంతో మంది యువతీ-యువకులు దేశం మెచ్చే సింగర్లుగా ఎదగాలని కోరుకుంటున్నానని దుండ్ర కుమారస్వామి తెలిపారు. సంగీతంతో ఎన్నో రోగాలను నయం చేశారని చరిత్రలో ఉంది.. ఇక్కడ ఉన్న సంగీతకారులు సామాజిక అసమానతలను రూపుమాపాలని కోరుకుంటున్నానని అన్నారు. సంగీతంలో ఎంతో ఎత్తు ఎదిగిన నా మిత్రుడు ఘంటాడి కృష్ణ గురించి ఇక్కడ వాళ్లకు పరిచయం అవసరం లేదు.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను అందించాడు.
గొప్ప గొప్ప సాంగ్స్ ను అందించిన ఘంటాడి కృష్ణ ఇక్కడ ఉన్న వాళ్లలో ట్యాలెంట్ ను గుర్తించి.. తన రాబోయే సినిమాలలో ఇక్కడ వాళ్లలో ఎవరికైనా అవకాశాలు ఇస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు దుండ్ర కుమారస్వామి.