రాంచరణ్ సతీమణి అపోలో ఆసుపత్రి చైర్ పర్సన్ ఉపాసన తనదైన శైలిలో చేసే ప్రతి పనిలోనూ ప్రత్యేకతను చూపిస్తుంది. తన బిజినెస్ తో పాటూ సామాజిక కార్యక్రమాలు కూడా ఎక్కువగానే చేస్తుంది. అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ నుండి ఉపాసన హ్యుమన్ లైఫ్, వైల్డ్ లైఫ్ కోసం పాటు పడుతుంటారు. దీనికి ఆమెకు నాట్ హెల్త్ సీ.ఎస్.ఆర్. అవార్డు లభించింది.
గ్రామాల్లో ప్రజలకు మంచి వైద్య సేవలను ఇచ్చేందుకు వారి ఫౌండేషన్ చేస్తున్న పనులను గుర్తించి 2022 సంవత్సరానికి ఉపాసన కు ఈ అవార్డు లభించింది. ఓ గొప్ప కార్యక్రమంలో తమల్ని భాగం చేసిన తమ తాతయ్య, ఫౌండర్ ఛైర్మన్ డ్ర్.ప్రతాప్ సి రెడ్డికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుందని ఉపాసన తెలిపింది. వైద్య సేవలను మెరుగుపర్చి గ్రామాలను అభివ్రుద్ధి చేయాలనే ఆయన తపన తనకు స్ఫూర్తి అని చెప్పారు.