సంగారెడ్డి: ఈ కరోనా కష్టకాలంలో రక్తం దానం చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం వల్ల, అన్ని చోట్ల రక్తపు నిల్వలు నిండుకున్న పరిస్థితి నెలకొంది. ఇక అత్యవసర సమయానికి రక్తం దొరకకపోవడం వల్ల ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము ఉన్నాం అంటూ, మానవత్వం ఉన్న మనుషులుగా ముందుకొచ్చి ఎంతో మందికి రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా మారి, అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు “నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ సభ్యులు”
అలాగే సంగారెడ్డి పట్టణంలోనీ గోకుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణఖేడ్ కీ చెందిన పాపయ్యకి శస్త్ర చికిత్స నిమిత్తం అత్యవసరంగా “B” పాజిటివ్ రక్తం అవసరం ఉండగా నారాయణఖేడ్ నుండి హైదరాబాద్ వెళ్తూ నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ ద్వారా సమాచారం అందుకోని బిరాదర్ సునీల్ ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేయడం జరిగింది. వారికీ నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ తరుపున ముజాహెద్ చిస్తీ, మునీర్, ఓం ప్రకాష్, సంతోష్ రావుతదితరులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.