నారాయణఖేడ్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ప్రస్తుతం 18 సంవత్సరల లోపు ఉన్న ప్రతీ ఒక్కరికీ వాక్సినేషన్ చేస్తున్న నేపథ్యంలో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో వారు 28 రోజుల వరకు రక్తదానం చేయడానికి వీలు ఉండదు కాబట్టి ఇప్పటికే ఈ కరోనా కష్ట కాలంలో కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలకు భయపడి రక్తదానానికి ముందుకు రాకపోవడంతో బ్లడ్ బ్యాంకులలో రక్త నిలువలు నిండుకుంటున్న పరిస్థితి నెలకొంది. రాబోవు రోజుల్లో రక్త నిల్వలు లేక తలసేమియా బాధితులకు మరియు గర్భంతో ఉన్న మహిళలలకు ఇతర సమస్యలతో ఆసుపత్రులలో చేరిన వారికీ సరైన సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మీరు వ్యాక్సిన్ తీసుకోకముందే మీకు అందుబాటులో ఉన్న బ్లడ్ బ్యాంకులలో రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వండి అని నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకుడు ముజాహెద్ చిస్తీ విజ్ఞప్తి చేసారు..
నారాయణఖేడ్ ప్రాంతం వారైతే సంగారెడ్డి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేయగలరు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైతే రక్తదానం చేయడానికి ముందుకు వస్తారో, వారికే అత్యవసరం ఉన్నపుడు రక్తాన్ని నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ నుండి తప్పకుండా అందిస్తాం అని ముజాహెద్ చిస్తీ తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకులు, ముజాహెద్ చిస్తీ, ప్రధాన కార్యదర్శి మునీర్, సభ్యులు ఓం ప్రకాశ్, సంతోష్ రావులు పాల్గొన్నారు.