శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, శేరిలింగంపల్లి సిటిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హనుమాన్ తయారు గారి శస్త్ర చికిత్స నిమిత్తం అత్యవసరంగా A పాజిటివ్ రక్తం అవసరం ఉంటే, నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ సభ్యుడు నాగల్ గిద్దా మండలం గొందేగావ్ గ్రామానికి చెందిన అనిల్ ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడారు.
ఖేడ్ బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకుడు ముజాహెద్ చిస్తీ యొక్క గొప్ప ఆలోచనే, ప్రతిరోజు తెలంగాణ నలుమూలలా, ఎక్కడో ఒక చోట, ఆపదలో ఉన్న వారి ప్రాణం కాపాడుతుంది. కలియుగ దేవుళ్లుగా పేరుగాంచిన నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ చేస్తున్న ప్రాణదానానికి తెలంగాణ అంతటా మంచి ఆదరణ లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ సేవలను గుర్తించి, వారికి తగిన ప్రోత్సాహకాలు అందించాల్సిందిగా, ముజాహెద్ చిస్తీ, మునీర్, ఓంప్రకాశ్, సంతోష్ రావు ,పేషంట్ బంధువులు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేశారు..