నారాయణఖేడ్: దానాల అన్నింటిలో కెళ్ల రక్తదానం చాలా విలువైనది. ఆపదలో ఉన్న వారికి రక్తం ఇవ్వడం అంటే తిరిగి వాళ్లకు ప్రాణం పొయ్యాడమే అవుతుంది. అలాంటి మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుళ్లు గా పిలవబడే రక్తదాతలందరికి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా “తొలిపలుకు” శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
ఈ నేపథ్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి రక్తదానం చేసి వారి ప్రాణం కాపాడాలనే సదుద్దేశ్యంతో, ఎంతో మందికి రక్తదానం చేస్తూ, వాట్సాప్ గ్రూప్ లు పెట్టి, ఎంతో మందిని చైతన్య పరిచి, తనతో పాటుగా వందల మందితో రక్తదానం చేయిస్తూ, వేలమంది ప్రాణాలు కాపాడుతున్న “నారాయణఖేడ్ ముజ్జు భాయ్” గా పిలవబడే మొహమ్మద్ ముజాహెద్ చిస్తీ, “ప్రపంచ రక్తదాతల దినోత్సవం” సందర్భంగా మాట్లాడుతూ..
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అనే ఉద్దేశ్యంతో నేను ఇప్పటివరకు 16 సార్లు రక్తదానం చేయడం జరిగింది. ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చిన సరే లేచి వెళ్తాను రక్తం ఇచ్చేసి వస్తాను అన్నారు. “నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్” అనే ఒక వాట్సప్ గ్రూప్, జులై 5, 2017న స్థాపించడం జరిగింది. పెట్టిన అనతి కాలంలోనే అశేష స్పందన వచ్చింది. ఆ గ్రూపులో ఉన్న వారందరు కలిసి, ఈ కరోనా కష్ట కాలంలో 2020-2021 సంవత్సరంలో సుమారు 300 మంది కి పైగా రక్తదాతలు ఆపదలో ఉన్నవారికి రక్తదానాలు చెయ్యడం జరిగింది అన్నారు..
“ఖేడ్ బ్లడ్ డోనర్స్” అనే వాట్సప్ గ్రూప్ లో 227 మంది ఉన్నారు. ఈ గ్రూప్ ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది అని చెప్పడానికి గర్వపడ్తున్న అని అన్నారు. గతంలో రక్తదాతలు కేవలం రక్తదాన శిబిరంలో మాత్రమే రక్తదానం చేసేవారు. దానికి భిన్నంగా ఇప్పుడు పేషెంట్ ఉన్న ఆసుపత్రికి తమ సొంత ఖర్చులతో వెళ్లి, ముందు పేషేంట్ బంధువులను కలిసి, రక్తదానం చేసి పేషేంట్ యొక్క యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని వస్తారు మా దాతలు అని సగర్వంగా తెలియజేశారు..