వలిగొండ : తెలంగాణ, వలిగొండ మండలం, నాగారం టిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం దగ్గర జాతీయ పతాకం ఆవిష్కరించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలవేసి జాతీయ పతాకానికి కొబ్బరికాయలు కొట్టి, గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల నాగార్జున గారు జెండా ఆవిష్కరించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమానికి వలిగొండ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి సలీం, వలిగొండ పీస్ సీస్ వైస్ చైర్మన్ ఎల్లంకి స్వామి గారు, ప్రధాన కార్యదర్శి గొల్ల వెంకటేష్, ఉప సర్పంచి బాబు గారు మచ్చ గిరి గుట్ట డైరెక్టర్ కొంపల్లి సత్తయ్య గౌడ్, వార్డ్ నెంబర్లు మైసోళ్ళ సత్యం, వంగాల శ్రీనివాస్, నాయకులు బుంగ శ్రీనివాస్, కొంపల్లి శీను, రేఖ లక్ష్మయ్య, గొల్ల అరుణ్ కుమార్,వంగాల వెంకన్న, బర్ల కృష్ణ,కట్ట బిక్షం, మైసొళ్ళ మహేష్, ఎర్ర విక్రమ్, పల్లెర్ల మహేష్, పోల్ గిరి, ఎర్ర వినయ్, తూర్కపెల్లి రాజు పాల్గొన్నారు.