వలిగొండ: చిట్యాల, భువనగిరి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల ఆ రోడ్డు మార్గంలో పయనించే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని, నాగారం గ్రామ యువకులు గ్రామ సర్పంచ్ క్రిష్ణయ్య దృష్టికి తీసుకెళ్లగా, వారు వచ్చి పరిశీలించి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశ్యంతో తక్షణమే స్పందించి, దగ్గరుండి గుంతలు పూడ్చేపించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తీగల క్రిష్ణయ్య గారు మాట్లాడుతూ, ఈ రహదారి గుండా నిత్యం ఎన్నో వందల మంది ప్రయాణికులు పయనిస్తూ ఉంటారు, గతంలో కొంత మందికి ఈ గుంతల వల్ల రాత్రి వేళల్లో కనిపియ్యక పోవడం వల్ల యాక్సిడెంట్ కి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.
నాగారం గ్రామ యువకులు నా దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే, ఇలాంటి సంఘటనలు పునరావృతం కావొద్దు అనే సదుద్దేశంతో ఈరోజు ఈ గుంతలు అన్ని మూసేయ్యడం జరిగింది. మా గ్రామంలోని యూత్ చాలా యాక్టివ్ గా ఉంటారు. గ్రామ అబివృద్ది కోసం నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతీ సమస్య నేను పరిష్కరిస్తూ ఉంటాను, ఈరోజు మిగతా గ్రామాలకు ఆదర్శ గ్రామంగా నిలిచాము. నేనెప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాను, వారి సహకారంతో గ్రామ అభివృద్ధికి ముందుంటాను అని క్రిష్ణయ్య అన్నారు.
గ్రామ సర్పంచ్ స్పందించిన తీరుకు నాగారం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు..