మంకీ పాక్స్.. తెలంగాణ ప్రభుత్వం అలర్ట్
విదేశాల్లో మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో భాగంగా తెలంగాణరాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇటీవల మంకీ పాక్స్ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారు, ఒంటిపై రాషెస్ వచ్చిన వారి ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులను అదేశించింది.మంకీ పాక్స్ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్లో ఉంచనున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు అనుమానితులు జిల్లా వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. అనుమానితుల రక్త నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీకి పంపనున్నట్టు వెల్లడించారు.