ఉప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గ, చిల్కానగర్ దివుసిన్ లో మొహరం పండుగ సందర్బంగా, పీర్ల కొట్టం దగ్గర పీర్ల పండుగ ఉత్సవాలు నూర్ బేగం, మహబూబ్, క్రీమ్, ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఇర్షాద్ ఖాన్( ఉప్పల్ ఖాన్ ) రావడం జరిగింది. పీర్లు ఎత్తుకొని ఉత్సవాలలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త కుమారుడు హుస్సేన్, ప్రజల రక్షణ కోసం పోరాడి అమరుడైన రోజు వారి గుర్తింపు కోసం జరిగే ఉత్సవమే పీర్ల పండుగ అని, ఈ పీర్ల పండుగ త్యాగానికి నిలయమని వారన్నారు. అదేవిధంగా ఉప్పల్ పట్టణ ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో అజిజ్ భాయ్,మఖ్బూల్ భాయ్, ఉదయ్ , సంతోష్ , నూర్ , నిర్వాహకులు , నూర్ బేగం, మెహబూబ్, క్రీం తదితరులు పాల్గొన్నారు.