మోహన్ బాబు నటించిన “సన్ ఆఫ్ ఇండియా” సినిమా రిలీజ్ అయింది. ఆయన సినిమా మంచి సందేశాత్మక చిత్రమని పేర్కొన్నారు. మంచి కథ తో తీస్తే ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని అన్నారు. డైరెక్టర్ కథ చెప్పగానే తనకు నచిందని పేర్కొన్నారు. ఆయన సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగానే ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో ఆయన కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సినిమాలో చేయని నేరానికి జైలుకు వెళ్ళే వారి భాధల గురించి ప్రత్యేకంగా చూపించామని చెప్పారు. ఇండియాలో ఎంతోమంది వ్యక్తులు చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్నారనీ అదే అంశాన్ని ఈ సినిమాలో చూపించామని చెప్పారు.
తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి మాట్లాడారు. కొంతమంది తనకు ఈ ట్రోలింగ్ వీడియోలు పంపిస్తున్నారని, అవి చూసినప్పుడు కొంచం భాధ కల్గుతుందని చెప్పారు. ట్రోల్స్ నవ్వుతెప్పించేవిధంగా ఉంటే ఫర్వాలేదు కానీ ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా కాదు అని అన్నారు.
ఇద్దరు హీరోలు ఈ పనిని జనాలను అపాయింట్ చేసుకుని మరీ చేయిస్తున్నారు. వారు ఎవరో కూడా నాకు తెలుసు. వారు తాత్కాలిక ఆనందం పొందవచ్చుగాక. కానీ వారు తర్వాత ఇబ్బందు ఎదుర్కోక తప్పదు అని చెప్పారు.