ఉత్తరప్రదేశ్ లోఇప్పటివరకు మూడు దశల్లో పోలింగ్ పూర్తయింది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా ఫిబ్రవరి 23 వ తారీఖున నాలుగో విడత ఓటింగ్ జరుగుతుంది. వచ్చే నెల పదో తారీఖున ఫలితాలు వెల్లడిస్తారు.ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. నిన్న ప్రధానమంత్రి రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఉన్నావ్ లో ప్రచార సభలో పాల్గొన్నారు. ఇక్కడ జరిగిన ఒక పరిణామం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బి.జే.పి. ఉత్తరప్రదేశ్ చీప్ స్వతంత్ర దేవ్ సింగ్, ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడు ఇద్దరూ కలిసి శ్రీరాముని విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు.ఆ తర్వాత అవదేశ్ ప్రదాని పాదాలకు నమస్కరించడానికి ప్రయత్నించగా, తనను వద్దని చెప్పి, మీరు కాదు నేనే మీకు నమస్కరించాలి అని సూచిస్తూ వెంటనే తను అవదేశ్ కతిహార్ పాదాలకు నమస్కరించాడు. ఈ సంఘటన తో సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది. బిజెపి నేతలు ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తారు. తనను ప్రధాన సేవకుడిగా పేర్కొంటూ ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు.
మాదాపూర్ లో ఘనంగా సదర్ సమ్మేళనం
మాదాపూర్ లో ఘనంగా సదర్ సమ్మేళనం తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతికి నిదర్శనం సదర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి శ్రీకృష్ణుని అంశతో జన్మించిన యాదవులు...
Read more