- టీఆరెస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందన్న ఎమ్మెల్యే వివేకానంద్..
- వరద సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి…
- కోట్ల నిధులతో చెరువులు, నాలాల అభివృద్ధికి యుద్ధప్రాతిపదికన చర్యలు…
- కుత్బుల్లాపూర్ డివిజన్ గణేష్ నగర్ లో వర్షపు నీటి నాలాను అధికారులతో పరిశీలించిన జిహెచ్ఎంసి మేయర్, ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ లో వర్షాకాలంలో తలెత్తే వరద సమస్యలపై ఈరోజు జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయ లక్ష్మీ గారు స్థానిక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గణేష్ నగర్ లో పాదయాత్ర చేసి వర్షపు నీటి నాలాను పరిశీలించిన అనంతరం వర్షాకాలంలో వరద సమస్య పరిష్కారంకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరద నీరు పొంగి పోర్లకుండ సాఫీగా వెళ్లేందుకు నాలాలో పేరుకు పోయిన చెత్తను తొలగించి, వెడల్పు పనులకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ…
వరదల వల్ల నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రత్యేక దృష్టి వహిస్తున్నారని అన్నారు. ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో భారీ వరదలు సంభవించినప్పుడు ప్రజలు పడ్డ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని అలాంటి ఇబ్బందులు తిరిగి తలెత్తకుండా నాలాల అభివృద్ధికి కోట్ల నిధులను కేటాయించిందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నెలకొన్న అనేక సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమత,
ఎస్ సి శంకర్ నాయక్, డిసి మంగతాయారు,మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్, బొడ్డు వెంకటేశ్వర రావు, ఈఈ కృష్ణ చైతన్య, డిఈ పాపమ్మ, ఏఈ మల్లారెడ్డి, సీనియర్ నాయకులు సోమేష్ యాదవ్, కిషోర్ చారి, సత్తిరెడ్డి, కాలనీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ట్రెజరర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.