కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే గారిని కలిసేందుకు వివిధ ప్రాంతాల నుండి కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులకు తన నివాసం వద్ద కార్యాలయంలో అందుబాటులో ఉంటూ స్వయంగా వారి సమస్యలను తెలుసుకుంటూ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు.