యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి , షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన అర్హులైన 14 మందికి చెక్కులు పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్క్, శానిటైజర్ వాడాలని తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవలని ఇవే మనకు శ్రీరామ రక్ష అన్నారు.అదే విధంగా మండల కేంద్రంలో ఉన్నటువంటి 108 అంబులెన్స్ కి సంబంధించిన ఖర్చులు,అందులో పని చేసే సిబ్బంది జీతభత్యాలు తానే భరిస్తానని అన్నారు.
ఈ సందర్భంగా చుట్టూ ప్రక్కన గ్రామాల ప్రజలు తమ సమస్యలు తీర్చాలని వినతిపత్రలు అందజయ్యడంతో ఖచ్చితంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వలిగొండ ఎంపీపీ నూతి రమేష్,వలిగొండ సర్పంచ్ బోళ్ల లలిత,ఎంపీటీసీ లు,మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.