యాదాద్రి భువనగిరి: తెలంగాణ,యాదాద్రి భువనగిరి జిల్లాలోని నెమరగొముల గ్రామానికి ఇటీవల కరోనా వ్యాధితో మరణించిన ఓకే కుటుంబానికి చెందిన సంకూరి జంగయ్య, చంద్రయ్య, బాలమ్మ కుటుంబ సభ్యులను మన గౌరవ ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి గారు పరామర్శించారు. మీరేం అధైర్య పడొద్దు, మీ కుటుంబానికి అండగా మేము ఉంటాము అని ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం జరిగింది..
ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్ జడ్పిటిసి ప్రణీత పింగల్ రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేష్ రెడ్డి, మండల రైతు సమితి కన్వీనర్ బొక్క జైపాల్ రెడ్డి, బీబీనగర్ పిఎసిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ సంకూరి నాగరాజు, సర్పంచ్ ఆముదాల సుమతి, వార్డ్ సభ్యులు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పాలకూర జంగయ్య గౌడ్ మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.