ఆందోల్ : తెలంగాణ రాష్ట్ర, మెదక్ జిల్లా, పుల్కాల్ మండలం, బస్వాపూర్ గ్రామంలో బృహ ప్రకృతి వనంలో భాగంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో సురెడ్డి ఇటిక్యాల్ లో హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని చెట్లు నాటి వాటిని పెంచడం ద్వారా నివారించగలమని, రాష్ట్రాన్ని పచ్చటి వనంలా మార్చాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమంలా తలపెట్టిన తెలంగాణ హరితహరం ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగారెడ్డి జిల్లా జడ్పి చైర్మన్ మంజు శ్రీ, ఎంపీడీఓ మధులత, ఎమ్మార్వో పరమేశ్వర్, మండల రైతు బంధు అధ్యక్షులు నర్సింహ రెడ్డి, అందోల్ ఆత్మకమిటి చైర్మన్ యాదగిరి రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ముద్దైపెట్ విజయ్, గ్రామ సర్పంచులు రాదయ్య, సంగమ్మ విష్ణయ్య, సీనియర్ నాయకులు బక్క రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.