కుత్బుల్లాపూర్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని సుచిత్ర మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ” మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ” షోరూంను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
షోరూం ప్రారంభించిన అనంతరం మొదటిసారిగా నగలు కొనుగోలు చేసిన ముగ్గురు కస్టమర్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి, సుధాకర్ గౌడ్, గుమ్మడి మధు సుధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.