ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ డివిజన్ పరిధిలోని కొమ్మిడి కృష్ణారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఉప్పల్ మండల తాసిల్దార్ గౌతమ్ కుమార్ అధ్యక్షతన గురువారం జరిగిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్లు వరుసగా మీర్పేట్ హెచ్ .బి. కాలనీ జెర్రిపోతుల ప్రభుదాస్, మల్లాపూర్ పన్నాల దేవేందర్ రెడ్డి, నాచారం శ్రీమతి శాంతి సాయి జైన్ శేఖర్, చిల్కానగర్, హబ్సిగూడ, రామంతపూర్ శ్రీమతి బండారు శ్రీవాణి,ఉప్పల్ శ్రీమతి రజిత రెడ్డి లతో కలిసి 430 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ఆడబిడ్డలకు తోబుట్టు పెద్దన్న లాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటూ వారి పెళ్లిళ్లకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం గొప్ప పరిణామం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ముఖ్యంగా పేదలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారన్న ఆశాభావాన్ని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి వ్యక్తం చేశారు.
ఏడాదిన్నర కరోనా కష్ట కాలం లోనూ పెళ్లైన ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందించడంలో ఇలాంటి లోటు రానీయకుండా ఆర్థిక సాయం అందించడం జరుగుతూనే ఉందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ఓ మహా యజ్ఞంలా కొనసాగిస్తూ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నాడని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ఎం.డి రఫీ, ఆర్ .ఐ లు షాహీన్, రామకృష్ణ, వి. ఏ వో. లు, వీఆర్ఏలు రెవెన్యూ సిబ్బంది టిఆర్ఎస్ నాయకులు అరటికాయల శాలిని, భాస్కర్ ముదిరాజ్, లేతఆకుల రఘుపతి రెడ్డి, వేముల సంతోష్ రెడ్డి, పల్ల కిరణ్ కుమార్ రెడ్డి , గరిక సుధాకర్, టం టం వీరేష్ ,పంగ మహేందర్ రెడ్డి, వేముల పరమేష్, కట్ట బుచ్చన్న గౌడ్ , సూర్య రతన్ ప్రకాష్ ,నందికంటి శివ, కొంగల శ్రీధర్,. రాజు ,సాయి రాజ్ రెడ్డి, సల్ల సందీప్ రెడ్డి, నాగిరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.