క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ టెస్సి థామస్ వైమానిక విభాగం ప్రధాన సంచాలకురాలు గా నియమితులయ్యారు
క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ టెస్సి థామస్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వైమానిక విభాగం ప్రధాన సంచాలకురాలు(డైరెక్టర్ జనరల్)గా నియమితులయ్యారు. గురువారం పదవీ విరమణ చేయనున్న డాక్టర్ సి.పి.రామనారాయణన్ స్థానంలో వచ్చే శుక్రవారం నుంచి నూతన బాధ్యతల్ని చేపట్టనున్నారు. టెస్సి థామస్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబరేటరీస్ సంచాలకురాలుగా సేవలందిస్తున్నారు. క్షిపణుల తయారీ పథకాలకు సారథ్యం వహించిన తొలి మహిళ శాస్త్రవేత్తగా ఇప్పటికే ఖ్యాతి గడించారు. రెండేళ్ల వ్యవధిలో వైమానిక విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతల్ని చేపట్టిన వారిలో ఆమె మూడో వ్యక్తి.
సాంకేతిక స్థాయిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ స్థాయికి ఎదిగిన మహిళల్లో మూడోవారు. శుక్రవారం నుంచి ఆమె కార్యక్షేత్రం హైదరాబాదులోని క్షిపణి సముదాయం నుంచి బెంగళూరులోని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) సముదాయంలోకి మారనుంది.