ఫీర్జాదిగూడ: ఈ రోజు ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ లోని బీబీ సాహెబ్ డివిజన్ 8వ వార్డు లోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి అతిధిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ శాసన సభ్యులు భేతి సుభాష్ రెడ్డి, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, మల్కాజిగిరి పార్లమెంటు ఇంఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు దర్గ దయాకర్ రెడ్డి, కార్పోరేటర్ శ్రీమతి శ్రీ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ నగర్ పార్క్ చుట్టూ ప్రహరి గోడ 14 లక్షల రూపాయల వ్యయంతో మరియు ఎస్.ఎన్ కాలనీలో 25 లక్షల వ్యయంతో సీ.సీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి మల్లారెడ్డి గారి చేతుల మీదుగా కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ కి చెందిన పలువురు కార్పోరేటర్లు కుర్ర శ్రీకాంత్ గౌడ్, కొల్తూరి మహేష్ డీఈ శ్రీనివాస్, ఏఈ వినీల్ మరియు డివిజన్ నాయకులు, అసోసియేషన్ సభ్యులు,కాలనీల పెద్దలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.