మేడిపల్లి: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని ఈ రోజు మేడిపల్లి పోలీస్ వారు రిమాండ్ కి తరలించారు…
వివరాలులోకి వెళితే… మౌలాలి వెంకటేశ్వర కాలానికి చెందిన వేమినేని శ్రీనివాస రావు అనే వ్యక్తి బొడుప్పల్ కి చెందిన ఎన్. శైలజ మరియు మరికొంత మంది వ్యక్తుల నుండి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి 12,75000/- రూపాయలు తీసుకొని మోసం చేసాడు అని బాధితులు పోలీస్ స్టేషన్ లో పిర్యాది చేయగా, మేడిపల్లి పోలీస్ వారు కేసు నమోదు చేసి, శ్రీనివాస రావు ని అదుపులోకి ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరిగింది.