బోడుప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని తిరుమల పద్మావతి గార్డెన్ ఏర్పాటు చేసిన, మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి ప్రసంగిస్తూ…
- రాష్ట్రంలో టీఆరెస్ పార్టీ అధికారానికి, చమరగీతం పాడాలంటే ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి, బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషిచేయాలని, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
- కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర సంపదను దోచుకొని రాష్ట్రాన్ని చిరిగిన ఇస్తారాకుల తయారు చేసారని, విమర్శించారు.
- గాడి తప్పిన తెలంగాణని గాడిలో పెట్టాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.
- కేసీఆర్ ప్రజల మేలుకోసం కాకుండా అధికార కాంక్ష కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.
- కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రాణాలు కొల్పుతున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే సంజీవనిలా పనిచేస్తోందని పేర్కొన్నారు.
- తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం అప్పుడు ఉద్యమించామని, కేసీఆర్ గద్దె దించుటకు ఇప్పుడు కార్యకర్తలు అప్పటి ఉద్యమంల పనిచేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.