తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ శ్రీ గోపి ఐఏఎస్ గారి అధ్యక్షతన,గౌరవ డిప్యూటీ మేయర్ గారు,గౌరవ కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం తెలంగాణకు హరితహారం, వార్డ్ కమిటీ సమావేశాలు,ఇతర రాష్ట్రాల వలస కార్మికుల వివరాల సేకరణ వంటి పలు ప్రధాన అంశాలపై చర్చా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ మేయర్ గారు,కమిషనర్ గారు మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా ప్రతిష్టాత్మకంగా చేపట్టే తెలంగాణకు హరిత హారం కార్యక్రమం నిర్వహణలో భాగంగా ఈ సారి లక్ష్యంగా 5 లక్షల 28 వేల 9 వందల మొక్కలు విజయవంతంగా కార్పొరేషన్ పరిధిలో నాటాలని, అదే విధంగా ప్రతి డివిజన్ కార్పొరేటర్ అధ్యక్షతన కమిటీ సభ్యులతో,మరియు స్థానిక ప్రజలతో వార్డ్ కమిటీ సమావేశాల నిర్వహించాలని, మరియు ఇతర రాష్ట్రాల వలస కార్మికుల వివరాలు సేకరించి,వాటిని కార్పొరేషన్ కార్యాలయంలో నమోదు చేసి వారికి ప్రభుత్వ పథకాల లబ్ది చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని పలు కీలక అంశాలపై సమావేశ చర్చ నిర్వహించడం జరిగింది. ఈ మేరకు గౌరవ కార్పొరేటర్లు ,కో ఆప్షన్ సభ్యులు స్పందిస్తూ వారి యొక్క అభిప్రాయాలను,సలహాలను, సూచనలను తెలియజేశారు.