పీర్జాదిగూడ : తెలంగాణ రాష్ట్ర, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఈ రోజు మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఎలక్ట్రికల్ (TSSPDCL) డిపార్ట్మెంట్ వారితో ఎలక్ట్రికల్ స్తంభాల షిఫ్టింగ్, నూతన స్తంభాలు & ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు మరియు లూస్ వైరింగ్ మొదలగు పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం మున్సిపల్ నిధుల నుండి డి డి రూపేణా చెల్లింపులు జరిగిన పనులు ఎన్ని పూర్తి అయినవి, మిగిలిన పనులు ఏ స్తాయిలో ఉన్నవి, ఎంతవరకు వచ్చినవి అని అడిగి తెలుసుకున్నారు, అనంతరం మిగిలిన పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ DE భాస్కర్ రావు, ADE శ్రీనివాస్ రెడ్డి, AE రాం రెడ్డి, వెంకటేశ్వర్లు, మున్సిపల్ AE వినీల్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.