పీర్జాదిగూడ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఈ రోజు మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మున్సిపల్ సాధారణ నిధులు అంచనా 12లక్షల వ్యయంతో 5వ డివిజన్ పాత పర్వతపుర్ లో గల మసీదు నుంచి మెయిన్ రోడ్ వరకు సిసి రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను డిప్యూటి మేయర్, స్థానిక కార్పొరేటర్ తో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్ బొడిగే స్వాతి, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇర్ఫాన్, నాయకులు బొడిగే కృష్ణా గౌడ్, డివిజన్ వాసులు గున్నాల అశోక్ రెడ్డి, పీసర్ల సత్తిరెడ్డి, బద్ధం అంజిరెడ్డి, మర్రి జంగారెడ్డి, E. కృష్ణ రెడ్డి, మునికుంట్ల సహదేవ గౌడ్, నిమ్మగుడెం ఆంజనేయులు, నరహరి, మసీదు పెద్దలు, కాలనీ వాసులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.