పీర్జాదిగూడ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేసారు. కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి పుట్టిన రోజు పురస్కరించుకొని మేయర్ జక్క వెంకట్ రెడ్డి , మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటడం జరిగింది. అనంతరం మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తన వంతు సహాయంగా 15 నూతన సీలింగ్ ఫ్యాన్లను మేయర్ జక్క వెంకట్ రెడ్డి సమక్షంలో ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాద్యాయులు వారికి శాలువాతో సన్మానించడంతో పాటు, పాఠశాలకు చేస్తున్నసేవలకు కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస్ గారు, కార్పోరేటర్ సుభాష్ నాయక్, నాయకులు ఈశ్వర్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి ,బుచ్చి యాదవ్, బండారి రవిందర్,నిర్మల ,మనోరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.