- జిల్లా అధ్యక్షులు గౌడ సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రణాళికలు
బోడుప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అతిత్వరలోనే బిఎస్పి పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని జిల్లా అధ్యక్షులు గౌడ సుదర్శన్ ఆధ్వర్యంలో భారీ ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్టు మున్సిపల్ కార్పొరేషన్ బి ఎస్ పి పార్టీ అధ్యక్షులు బండ నర్సింహ్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ జిల్లా కో ఆర్డినేటర్ శీలం అనిత రెడ్డి, జిల్లా అధ్యక్షులు గౌడ సుదర్శన్ జిల్లా ఇంచార్జ్ సుక్క దయానంద్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ పీర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అతిత్వరలోనే బహుజన్ సమాజ్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని, రాష్ట్రవ్యాప్తంగా పలు పార్టీల నిరంకుశ పాలనతో విరక్తి చెందిన పలు పార్టీల నేతలు కార్యకర్తలు ప్రజలు బీఎస్పీ పార్టీ వైపు బహుజన రాజ్యాధికారం వైపు ఆలోచనలు ఉన్నాయని, ఇటీవలి నల్గొండ పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో సుప్రీం స్వేరో గురుకుల మాజీ కేరటం మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ చేరికతో దేశ ,రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నమ్మకం కలిగిందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బి ఎస్ పి పార్టీ ప్రభుత్వాన్ని చేపడుతుందని, దేశ ప్రధానిగా భహేంజి మాయావతి ఎన్నిక కావటానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని కోరారు. కాబట్టి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేద వర్గల ఓసీలు తదితరులు క్రమశిక్షణ కలిగిన బిఎస్పి పార్టీ అదేవిధంగా డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతు పలకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి పార్టీ సీనియర్ నాయకులు కుమార్ .వేముల బాలస్వామి. పెంటయ్య .వెంకన్న .రాజ్ కుమార్. సురుగుప్రభాకర్ .తదితరులు హాజరయ్యారు.