దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘మారుతి సుజుకీ’ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌తో ముందుకొస్తోంది. ఎంపిక చేసిన మోడల్ కార్లపై రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు డిస్కౌంట్ తీసుకొస్తున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.
ఆల్టో, వేగాన్‌ఆర్, స్విఫ్ట్, ఎర్టిగా మోడళ్లపై ఈ తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ ఈ ఏడాది రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ చివరి నాటికి అమ్మకాలను మరింత పెంచుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలవడానికి ఈ ప్రత్యేక ఆఫర్లతో ముందుకొస్తున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం.
క్రిస్‌మస్, న్యూ ఇయర్ కానుకగా ‘మారుతీ సుజుకీ’ కంపెనీ తాజా డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. మారుతి ఆల్టో 800పై రూ. 35,000, స్విఫ్ట్‌పై రూ. 30,000, ఎర్టిగా డీజిల్ కార్‌పై రూ. 40,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.