మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణతో పాటు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసానికి దోహదపడుతయని జగద్గిరిగుట్ట ఎస్సై యాదగిరి అన్నారు. ఆల్విన్కాలనీ డివిజన్ పరిధి ఎల్లమ్మబండలో కుంగుఫూడూ మార్షల్ ఆర్ట్స్ ఆకాడమి గ్రాండ్ మాస్టర్ కంట్రీస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బెల్ట్ టెస్ట్ కార్యక్రమానికి ఎస్సై యాదగిరి, కూకట్పల్లి ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఎంఏ. కరీమ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ అభ్యసిస్తున్న చిన్నారులు కటాస్, స్పారింగ్, అభ్యసించిన విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులకు గ్రాండ్ మాస్టర్ కంట్రాస్ బెల్టులు, ఎస్సై యాదగిరి, ఎం.ఏ. కరీమ్లు సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై యాదగిరి మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణతో పాటు మానసిక ఉల్లాసానికి దోహద పడుతాయని అన్నారు. యువతులు, మహిళలు తమ ఆత్మరక్షణలు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంగ్ఫూడూ మాస్టర్ ఫిరోజ్, మాస్టర్ శ్రీనివాస్, వెంకటేష్ యాదవ్, చిన్నారుల తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more